Friday, May 20, 2016

ది షాషాంక్ రిడెంప్షన్ (1994)

జీవితం...ఒక జైలు... స్వేచ్ఛ కోసం ఆరాటం!

Sakshi | Updated: March 09, 2015 00:01 (IST)
జీవితం...ఒక జైలు... స్వేచ్ఛ కోసం ఆరాటం!
 అందుకే... అంత బాగుంది!
 ది షాషాంక్ రిడెంప్షన్ (1994)
 హాలీవుడ్

  తారాగణం: టిమ్ రాబిన్స్, మోర్గాన్ ఫ్రీమన్, బాబ్ గుంటన్, విలియమ్ శాడ్లర్
 దర్శకుడు: ఫ్రాంక్ డారాబాంట్  ;   ఛాయాగ్రహణం: రోజర్ డీకిన్స్
 విడుదల తేదీ: 1994 సెప్టెంబర్ 10 ;  సినిమా నిడివి: 142 నిమిషాలు
 నిర్మాణ వ్యయం: 2.5 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 150 కోట్లు)


 సుకుమార్
 ప్రముఖ సినీ దర్శకుడు


 ‘‘ ‘ది షాషాంక్ రిడెంప్షన్’ సినిమా చూశావా?’’...
 నా ఫ్రెండ్ దర్శక - రచయిత వేమారెడ్డి నన్ను అడగడం అది అయిదోసారి.
 అప్పటికే చాలామంది ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం విన్నాను.
 కానీ, అంత గొప్పదనం ఏముందా సినిమాలో?
 నా మనసులో ఏవో ప్రశ్నలు... సందేహాలు... నాకు నేనే చెప్పుకొంటున్న సమాధానాలు... అవన్నీ ఎందుకు? సినిమా చూసేస్తే పోలా అనిపించింది. ఆ రాత్రి సినిమా చూడడం మొదలుపెట్టా. సినిమాలో దాదాపుగా అన్ని సీన్లూ జైల్లోనే!
 అరగంట తర్వాత ఆపేశా... ఎందుకో చూడబుద్ధేయలేదు!


 హీరో మహేశ్‌బాబుతో ‘1... నేనొక్కడినే’ సినిమా హడావిడిలో పడి, మళ్లీ దాని జోలికి వెళ్లలేదు. ‘1’ సినిమా రిలీజయ్యాక కొంచెం తీరిక దొరికి, ఎందుకో ఇంటర్‌నెట్‌లో ‘ఐఎండిబి’ వెబ్‌సైట్ ఓపెన్ చేశా. ‘ఐఎండిబి’ అంటే ‘ఇంటర్నెట్ మూవీ డేటాబేస్’. ప్రపంచ సినిమాలకు సంబంధించిన సమస్త సమాచారమూ అందులో ఉంటుంది. అందుకే రోజూ కోటిన్నర మందికి పైగా ఈ సైట్‌ను వీక్షిస్తుంటారు. ఈ సైట్‌లో అత్యుత్తమమైన హాలీవుడ్ సినిమాలంటూ 250 సినిమాల లిస్ట్ ఉంది. ఆ జాబితాలో మొదటి పేరు- ‘ది షాషాంక్ రిడెంప్షన్’.

 1998 నుంచి ఇప్పటివరకూ ఈ సినిమాదే నంబర్ వన్ ప్లేస్. నన్ను వదిలిపెట్టకుండా వెంటాడుతున్న అదే పేరు... అదే సినిమా!ఆ సినిమా వివరాలన్నీ చదివాక, మళ్ళీ నా మనసు ‘ది షాషాంక్ రిడెంప్షన్’ మీదకు మళ్ళింది. ఈసారి ‘ది షాషాంక్ రిడెంప్షన్’ చూడకుండా ఉండలేకపోయా.ఈసారి చూస్తూ చూస్తూ నన్ను నేను మరిచిపోయా. ఇన్నేళ్లూ ఈ సినిమా చూడనందుకు నన్ను నేనే తిట్టుకున్నా. నాలో ఏవేవో ఊహలు... భావోద్వేగం రెక్కలు తొడిగి, రివ్వున పైకి ఎగిరింది. ఈ సినిమా నాలో పాజిటివ్ ఎనర్జీ నింపింది. అప్పటి వరకూ నేను వర్రీలుగా భావించినవన్నీ ఒక్కసారిగా దూదిపింజల్లా ఎగిరిపోయాయి.

 జీవితానికి ఇలాంటి ఒక్క సినిమా తీస్తే చాలు కదా అనిపించింది. ఆ అనిపించడంలో తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే - ఈ సినిమాను ఇంకోసారి చూస్తే వెంటనే కాపీ కొట్టి సినిమా తీసేయాలనిపిస్తుంది. కానీ ఈ సినిమాలా తీయడం కష్టం... చాలా కష్టం.అంతెందుకు! ఈ సినిమా సృష్టికర్త ఫ్రాంక్ డారాబాంట్‌కే అసాధ్యం. ఆయన అంతకు ముందూ గొప్ప సినిమాలు తీయలేదు. ఆ తర్వాతా తీయలేదు. ‘కొన్ని అద్భుతాలు... అలా జరుగుతాయి. అంతే!’ అన్నట్టుగా తెర మీద జరిగిన ఒక అద్భుతం ఈ సినిమా.

 చిత్రమేమిటంటే - ఈ సినిమాకు ఆధారం ఓ చిన్న నవలిక.
 అమెరికాలో స్టీఫెన్ కింగ్ అని ఓ రచయిత ఉన్నాడు. అతను ‘డిఫరెంట్ సీజన్స్’ పేరుతో కొన్ని కథలు కలిపి ఓ పుస్తకం వేశాడు. అందులో ఓ చిన్న నవలిక - ‘రీటా హేవర్త్ అండ్ ది షాషాంక్ రిడెంప్షన్’. ఈ నవలలోని ప్రధాన ఇతివృత్తం లియో టాల్‌స్టాయ్ రచన ‘గాడ్ సీస్ ది ట్రూత్... బట్ వెయిట్స్’ నుంచి స్ఫూర్తి పొందినట్లు చెబుతారు. అప్పట్లో తాను రాసిన కథలను సినిమాలుగా తీస్తే, ఒక్కో కథను ఒక డాలర్‌కే హక్కులు ఇచ్చేస్తానని రచయిత స్టీఫెన్ కింగ్ ప్రకటించాడు. అది చూసి ఫ్రాంక్ డారాబాంట్ 1983లో ‘ది ఉమన్ ఇన్ ది రూమ్’ అనే కథ తాలూకు హక్కులు తీసుకుని సినిమా తీశాడు. మళ్లీ 1987లో ‘రీటా హేవర్త్ అండ్ ది షాషాంక్ రిడెంప్షన్’ నవలిక హక్కులు అడిగితే, అతని మీద మంచి అభిప్రాయం ఉండడంతో స్టీఫెన్ వెంటనే హక్కులు ఇచ్చేశాడు.ఆ కథ మీద కూర్చుని ఫ్రాంక్ డారాబాంట్ రెండు నెలల్లో సినిమా స్క్రిప్ట్ తయారు చేశాడు. అలా ‘ది షాషాంక్ రిడెంప్షన్’ మొదలైంది.

 కథ ఏమిటంటే...
 ఆండీ డూఫ్రెస్నే అనే బ్యాంకర్ ఉంటాడు. అతని భార్యను, ఆమె ప్రియుణ్ణి హత్య చేశాడనే ఆరోపణ మీద కోర్టు ఆండీకి తప్పుగా ఖైదు శిక్ష విధిస్తుంది. అదీ ఒకటి కాదు... ఏకంగా రెండు జీవితకాలపు జైలుశిక్షలు. ఆండీని ‘షాషాంక్’ అనే జైలుకు తరలిస్తారు. కరడుగట్టిన నేరస్థులంతా ఉంటారక్కడ. వాళ్ల మధ్య ఆండీ ప్రత్యేక వ్యక్తిత్వంతో కనబడతాడు. ఆండీకున్న బ్యాంకింగ్ నైపుణ్యం గురించి తెలుసుకున్న జైలు వార్డెన్ శామ్‌నోర్టాన్ తన అవినీతి వ్యవహారాలకు ఇతణ్ణి ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆండీని నిర్దోషిగా రుజువు చేసే సమాచారం తన దగ్గర ఉందని జైలుకి కొత్తగా వచ్చిన టామీ అనే ఖైదీ చెబుతాడు. కానీ, టామీని జైలు వార్డెన్ చంపించేస్తాడు. ఎందుకంటే ఆండీ జైలు నుంచి వెళ్లిపోవడం వార్డెన్‌కు ఇష్టం ఉండదు.

 చివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఆండీ జైలు నుంచి సొరంగం తవ్వుకుని, మెక్సికో పారిపోతాడు. అక్కడ నుంచీ జైలు వార్డెన్ మోసాలు బయటపెడతాడు. దాంతో వార్డెన్ ఆత్మహత్య చేసుకుంటాడు. జైలులో స్నేహితుడైన రెడ్‌ను విడిపించి, ఆండీ స్వేచ్ఛగా, కొత్తగా జీవితం ప్రారంభిస్తాడు. చాలా సామాన్యమైన కథలా అనిపిస్తుంది కానీ, ఇందులో అసామాన్యమైన విషయాలు ఉన్నాయి. ఆండీ పాత్ర కూడా చాలా సింపుల్‌గా కనిపిస్తుంది. కానీ నిలువెత్తు ఆత్మవిశ్వాసానికీ, ఆశావాదానికీ ప్రతీకలా అనిపిస్తాడు. ఒక్కరోజు స్వేచ్ఛ కోసం ఎన్నేళ్లు కష్టపడ్డా ఫరవాలేదనుకునే మనస్తత్వం అతనిది.
రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కూడా ఎక్కడా నిరాశకు లోను కాడు. తనకున్న మేధతోపాటు, ఓపికతో, భవిష్యత్తు పట్ల ఆశతో... రోజూ కొద్ది కొద్దిగా చొప్పున జైలులో నుంచి సొరంగం తవ్వడం మొదలుపెడతాడు. అక్కణ్ణుంచీ సొరంగం తవ్వి బయట పడాలంటే సుమారు 20 ఏళ్లు పడుతుంది. అయినా రోజూ ఓపిగ్గా తవ్వుతూనే ఉంటాడు. అది కూడా మూడో కంటికి తెలియకుండా! మనమేమో వారం రోజులు కష్టపడితే, మంచి జరుగుతుందంటేనే, ‘అమ్మో... వారం రోజులా’ అంటాం. ఓపిక పట్టలేం. అలాంటిది 20 ఏళ్లు జైలు నుంచి సొరంగం తవ్వడమంటేనే, అతని ఆశావాదం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

 ఆండీ జైలు నుంచి తప్పించుకునే సన్నివేశం చూస్తుంటే, చిన్నపిల్లాడిలా చప్పట్లు కొట్టేస్తాం. చలం చిన్న వాక్యంలో చెప్పినట్టుగా... పైకి జైలులో జరిగే కథలాగా అనిపిస్తుంది కానీ, ఇందులో ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ‘నా స్వేచ్ఛను భగ్నం చేసి...’ అంటూ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన కవిత్వం గుర్తుకొస్తుంది. ఇలాంటి ఫిలాసఫీతో భారతదేశంలో ఇంతవరకూ సినిమా రాలేదంటే అతిశయోక్తి కాదు. ఇందులో గొప్ప తారాగణం కూడా లేదు. కొన్ని డైలాగుల్లో అద్భుతమైన ఆశావాదం, నిజాయతీ కనిపించి, సినిమా చూసిన చాలా రోజుల వరకు మనల్ని వెంటాడుతుంటాయి. ఈ చిత్ర దర్శకుడి ప్రతిభను మనం గుర్తుపెట్టుకోవాలి. కథను చాలా బాగా తెరపై చెప్పాడు.

 ప్రేక్షకులందరికీ సరిగ్గా కనెక్ట్ అయ్యే ఫ్రీక్వెన్సీలో సినిమా మూడ్ ఫ్లో అవుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే, తెర మీద జరుగుతున్నది ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి ఓ టైమింగ్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అన్నిసార్లూ, అందరికీ అంతు చిక్కదు. ఈ సినిమా ఆ ఫ్రీక్వెన్సీని బాగా పట్టేసింది. అందుకే ఈ సినిమా ప్రపంచమంతటికీ నచ్చేసింది. 1994 ఆస్కార్ అవార్డు పోటీలో ఏడు విభాగాల్లో అవార్డులకు ఈ సినిమా నామినేట్ అయింది. అయితే, ‘ఫారెస్ట్ గంప్’ ఇచ్చిన పోటీ వల్ల ఈ సినిమాకు ఒక్క ఆస్కార్ అవార్డు కూడా రాలేదు. అయినా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. దాని ముందు ఆస్కార్ విలువెంత?!

 ఈ సినిమా చెప్పే ఫిలాసఫీ - జీవితేచ్ఛ. జీవితాన్ని జీవితంలా ఆస్వాదించాలి. ఈ సినిమా చూస్తుంటే బతుకు మీద కొత్త ఆశ మొదలవుతుంది. చిన్న చిన్న విషయాలకు హైరానా పడిపోతూ, జీవితాన్ని ఎందుకింత వృథా చేసుకుంటున్నామా అనిపిస్తుంది. జీవితానికో కొత్త అనుభవం, కొత్త ఉత్సాహం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే!

 జీవితాన్ని వడకట్టిన హారర్ కథకుడు

 సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత ఫ్రాంక్ డారాబాంట్ ప్రాథమికంగా హార్రర్ సినిమాల రచయిత. ‘ఎ నైట్‌మేర్ ఆన్ ఎల్మ్ స్ట్రీట్ 3 - డ్రీమ్ వారియర్స్’, ‘ది బ్లాబ్’, ‘ది ఫ్లై-2’ లాంటి హార్రర్ చిత్రాలు రాసింది ఆయనే. టీవీలో ‘ది వాకింగ్ డెడ్’ అనే హార్రర్ సిరీస్‌ను తీర్చిదిద్ది, కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరించారు. స్వతహాగా రచయిత అయినప్పటికీ, మరో రచయిత స్టీఫెన్ కింగ్ రాసిన నవలల్ని ఆయన వెండితెరకెక్కించడం విశేషం. ‘ది షాషాంక్ రిడెంప్షన్’ (1994)తో పాటు ‘ది గ్రీన్ మైల్’ (1999), ‘ది మిస్ట్’ (2007) చిత్రాలూ అలా కింగ్ రాసిన నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలే. కింగ్ రాసిన ‘ది లాంగ్ వాక్’, ‘ది మంకీ’ అనే మరో రెండు కథల హక్కులు కూడా డారాబాంట్ దగ్గరే ఉన్నాయి. వాటిని ఎప్పటికైనా సినిమాలుగా తీస్తానంటారాయన. చిత్రమేమిటంటే, సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రాల్లో కొన్నింటికి స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసింది డారాబాంటే! ‘ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్’ సినిమా తొలి డ్రాఫ్ట్ కూడా డారాబాంట్ రాసిందే!

 ఫ్రాంక్ డారాబాంట్
 రచయిత, దర్శక, నిర్మాత

హాలీవుడ్‌లో... బొమ్మల బాపు

హాలీవుడ్‌లో... బొమ్మల బాపు

Sakshi | Updated: April 24, 2015 23:52 (IST)
హాలీవుడ్‌లో... బొమ్మల బాపుక్రిస్టఫర్ నోలన్
సినిమా స్క్రిప్ట్‌ల్లో బాపు సినిమా స్క్రిప్ట్ ప్రత్యేకమైనది. ఇంచక్కా ప్రతి సన్నివేశానికి బొమ్మలు వేసి స్క్రిప్టు బుక్‌లో ముందే సినిమా చూపిస్తారు. ఇలా చాలా తక్కువ మంది మాత్రమే బొమ్మలతో స్క్రిప్ట్‌లు తయారు చేసుకుంటారు. ‘ఇన్‌సెప్షన్’ నుంచి ఇటీవలి ‘ఇంటర్‌స్టెల్లార్’  చిత్రాల దాకా హాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. ఈ దిగ్దర్శకుడు కూడా స్క్రిప్ట్‌ను స్కెచ్‌లుగా మార్చే కళాకారుడే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ట్రైబె కా చిత్రోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రిస్టఫర్ మాట్లాడుతూ ‘‘మూలకథ  కూడా రాసుకోను. అంతా స్కెచ్ వర్కే ఉంటుంది. దీంతో కథలో తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయంపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇదే నా శైలి. నా ‘మెమొంటో’ చిత్రానికి మాత్రమే స్క్రిప్ట్ రాసుకున్నాను. మిగతా వాటన్నిటికీ ఇలస్ట్రేషన్స్ వేసుకున్నా’’ అని చెప్పారు.

రీడ్ అండ్ లీడ్

రీడ్ అండ్ లీడ్

Sakshi | Updated: April 22, 2015 22:34 (IST)
రీడ్ అండ్ లీడ్
‘పుస్తకం లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది’ అంటారు రోమ్ ప్రముఖ తత్వవేత్త మార్కస్ టులియస్ సిసెరో. ఓ మంచి పుస్తకం విజ్ఞానం, వికాసం వైపు నడిపిస్తుంది. కానీ ప్రస్తుత హైటెక్ యుగంలో పుస్తక పఠనం బాగా తగ్గిపోయింది. విస్తృతమైన ఇంటర్నెట్, విరుచుకుపడుతున్న గాడ్జెట్స్.. పుస్తకం తెరిచే సమయమే ఉండటం లేదు నేటి తరానికి. ఈ పరిస్థితిని కొంతైనా మార్చి పుస్తకానికి పూర్వ వైభవం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ‘యానిమల్  రీహాబిలిటేషన్ ప్రొటెక్షన్ ఫ్రంట్’(ఏఆర్‌పీఎఫ్) వారు.

ఏటా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద పిల్లలకు వివిధ రకాల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వారిని బుక్ రీడింగ్ వైపు మళ్లించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నగరంలోని అనాథ ఆశ్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, మురికి వాడల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులకు పుస్తకం ప్రాముఖ్యాన్ని తెలిపేలా క్యాంపెయిన్ చేపట్టారు. విజ్ఞాన, వినోద పుస్తకాల గురించి వారికి వివరించారు. జంతు సంరక్షణ, భూ సంరక్షణ, జనరల్‌నాలెడ్జ్ తదితర బుక్స్‌ను పంపిణీ చేశారు. వాటితో పాటు పెన్సిల్స్, పెన్స్ పంచిపెట్టారు.

‘అంతటితోనే మా మిషన్ ఆగిపోదు. ఆయా ప్రాంతాల్లో విద్యపై ఆసక్తి ఉండి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చదువుకోలేని వారిని బడిలో చేర్పిస్తున్నాం. జీవితానికి ఉపయోగపడే మంచి పుస్తకాలు, వాటి రచయితల విశిష్టతను పిల్లలకు తెలియజెబుతూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేస్తున్నాం’ అంటూ చెప్పారు సంస్థ నిర్వాహకుడు నిహార్. ఈ సామాజిక సేవలో నిహార్‌కు తోడుగా ఎంతో మంది వాలంటీర్లు జతకలిశారు. ‘పుస్తకం, విద్య, జీవజాలం, భూమి.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేయాలంటే వీటి ప్రాధాన్యం నేటితరానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు టీం మెంబర్స్.
- సిరి

కాలపరీక్షలో...వెండితెర విజేత

కాలపరీక్షలో...వెండితెర విజేత

Sakshi | Updated: March 03, 2015 03:16 (IST)
కాలపరీక్షలో...వెండితెర విజేత
సింగీతం శ్రీనివాసరావు సుప్రసిద్ధ దర్శకుడు
 హాలీవుడ్
 తారాగణం:ఎల్లార్ కోల్ట్రానే, లోరెలీ లింక్లాటర్,
 ప్యాట్రీషియా ఆర్క్వెట్, ఎథాన్ హాకీ
 చాయాగ్రహణం:    లీ డేనియల్, షానె కెల్లి
 దర్శకత్వం:     రిచర్డ్ లింక్లాటర్
 విడుదల:     2014 జూలై 11 (అమెరికా)
 సినిమా నిడివి:     165 నిమిషాలు
 నిర్మాణ వ్యయం:     40 లక్షల డాలర్లు (రూ. 24 కోట్లు)
 ఇప్పటివరకు వసూళ్లు:     444 లక్షల డాలర్లు (దాదాపు రూ. 276 కోట్లు)


 నాకు నచ్చిన హాలీవుడ్ సినిమా అంటే కచ్చితంగా ‘బాయ్‌హుడ్’ పేరు చెబుతా. అలాగని నాకు ఇదొక్కటే నచ్చిందని కాదు. ప్రతి సంవత్సరం వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని చాలా బాగుంటాయి. మరికొన్ని కలకాలం నిలిచిపోయేవిలా ఉంటాయి. ఈ రెండో కోవకు చెందినదే - ‘బాయ్‌హుడ్’.నిజానికి గతవారం ముగిసిన ‘ఆస్కార్’ అవార్డుల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమా ఇది. ‘బర్డ్‌మ్యాన్’ చిత్రానికీ, ‘బాయ్‌హుడ్’ చిత్రానికీ మధ్య ఒక తెలియని పోటీ ఆ అవార్డుల్లో నెలకొంది. కథాకథనానికి సంబంధించి రెండు వేర్వేరు శైలులను ఇష్టపడే వారి మధ్య జరిగిన పోటీ అది. ‘బర్డ్ మ్యాన్’ చిత్రం హాలీవుడ్ మీద తీసిన వ్యంగ్యపూరిత హాస్య చిత్రమైతే, ‘బాయ్‌హుడ్’ సినిమా పన్నెండేళ్ళ జీవితంలోని ఘట్టాలను సహజాతి సహజంగా చూపిన సినిమా. హాలీవుడ్ జీవితం మీద తీసిన సినిమాగా ‘బర్డ్ మ్యాన్’ ఉత్తమ చిత్రంతో పాటు మరో మూడు విభాగాల్లో ఆస్కార్‌ను అందుకోవడం ఆశ్చర్యం అనిపించదు.

 ‘బాయ్‌హుడ్’ చిత్రం ఒక పాత్రను అద్భుతంగా చిత్రిస్తూ, పెరిగే వయసుతో పాటు అమాయకత్వం తరగిపోతూ రావడాన్ని చూపెడుతుంది. నిజం చెప్పాలంటే, ‘బాయ్‌హుడ్’ ఒక అద్భుతసృష్టి. నాకు తెలిసినంత వరకూ, ఇంతవరకూ ఇలాంటి ప్రయోగం ఎవరూ చెయ్యలేదు. ఇది మన జీవితాన్ని అనుసరిస్తూ చేసిన విచిత్రమైన సినిమా. ఇదొక అమెరికన్ కుటుంబానికి అద్దం పట్టే కథ. చూస్తున్నంతసేపూ ఒక సినిమా చూస్తున్నట్టుండదు. కొన్నేళ్ళ పాటు కొందరి జీవితాలను వాళ్లతో పాటు మనమూ అనుసరిస్తూ వెళుతున్నట్టుంటుంది.

 ఆరేళ్ల కుర్రాడు. మేసన్ అతని పేరు. అతని అక్క - సమంత. వాళ్ల తల్లి - ఒలివా. విడిపోయిన ఆమె భర్త - సీనియర్ మేసన్. వేరొకతనితో ఒలివా పెళ్లి. ఈ వాతావరణంలో మేసన్ పదేళ్ళ పెరుగుదల... ఇదీ సూక్ష్మంగా కథ.మామూలుగా మన సినిమాల్లో ఒక పాత్ర తాలూకు చిన్నప్పటి వేషాన్ని చూపించాలంటే, ఎవరైనా బాలనటునితో చిత్రీకరిస్తారు. కానీ విశేషమేమిటంటే - ఆరేళ్ల మేసన్ పాత్రను ఆరేళ్ల ఎల్లార్ కోల్ట్రాన్ పోషించాడు. ఇలాగే వాళ్ల వాళ్ల వయసులకు తగ్గట్టు మిగతా నటీనటులు పాత్రలు పోషించారు. ఇలా 2002వ సంవత్సరంలో ప్రారంభమైన షూటింగ్, అదే నటీనటులతో ప్రతి సంవత్సరం చిత్రీకరిస్తూ, అలా అలా 12 ఏళ్ళు చిత్రీకరించారు.

 అంటే ఆరేళ్ల కుర్రాడికి 18 ఏళ్ళు వచ్చేవరకూ అతనిలో ఏయే మార్పులు వచ్చాయో, వాటిని యథాతథంగా చిత్రీకరిస్తూ, 2013 వరకూ తీసి సినిమా ముగించారు. ఇలా ఇందులో నటించిన నటీనటులందరూ ఆ షూటింగ్ జరిగిన 12 సంవత్సరాల్లో ఎలా పెరిగారన్నది చూస్తుంటే ఒక అద్భుతమైన అనుభూతి. ఇలాంటి సినిమాలకు స్క్రీన్‌ప్లే రాయడం ఒక సాహసం. ఒక విచిత్రం. దీని దర్శకుడు రిచర్డ్ లింక్లాటర్ (ఖజీఛిజ్చిటఛీ ఔజీజ్చ్ట్ఛుట) చూచాయగా ఒక కథను నిర్ణయించుకున్నాడట. కాలాన్ని బట్టి నటీనటులు ఎలా మారుతుంటారో, దాన్ని బట్టి ప్రతి సంవత్సరం స్క్రీన్‌ప్లేను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుంటూ, చేర్చుకుంటూ రాసుకున్నాడట. ఈ సినిమాలో ట్రిక్స్ లేవు. స్పెషల్ ఎఫెక్ట్స్ లేవు. ఉన్నదల్లా జీవితమే! సమంత పాత్ర పోషించిన లోరెలీ సాక్షాత్తూ దర్శకుడు లింక్లాటర్ కూతురే.

 ఇటీవల ‘బాఫ్తా’ అవార్డుల్లో ‘బాయ్‌హుడ్’ ఉత్తమ చిత్రమైతే, లింక్లాటర్ ఉత్తమ దర్శకునిగా ఎన్నికయ్యారు. ‘పురుషులందు పుణ్య పురుషులు వేరయా’ అంటారు. రిచర్డ్ లింక్లాటర్ ఒక పుణ్య పురుషుడు. ‘ఆస్కార్’ అవార్డుల్లోనూ ‘బాయ్‌హుడ్’ చిత్రం తొమ్మిది విభాగాల్లో నామినేటై, ఉత్తమ చిత్రం విభాగంలో గట్టి పోటీనిచ్చినా, చివరకు ఉత్తమ సహాయ నటి విభాగంలో మాత్రమే ఆస్కార్‌ను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ‘ఆస్కార్’ను అందుకోకపోయినా, అంతకు మించిన గౌరవమున్న చిత్రంగా ‘బాయ్‌హుడ్’ రానున్న రోజుల్లో హాలీవుడ్ చిత్ర చరిత్రలో నిలిచిపోతుంది. పైకి చేదుగా అనిపించే ఈ తీపి జ్ఞాపకాన్ని తెరపై ఆస్వాదించండి.

  కథ ఏమిటంటే...
 సమంత, మేసన్ అక్కా తమ్ముళ్లు. వీళ్ల తల్లి ఒలివా సొంత కాళ్లపై నిలబడాలనుకుని డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం సంపాదిస్తుంది. ఒలివా భర్త సీనియర్ మేసన్ ఇరాక్ యుద్ధంలో ఉండడంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతుంటాడు. దాంతో ఒలివా, సీనియర్ మేసన్ విడిపోతారు. మూడేళ్ల తర్వాత - ఒలివా తన కుమారుడి ప్రొఫెసరైన బిల్‌తో ప్రేమలో పడుతుంది. బిల్ పిల్లలతో కలిసి సమంత, మేసన్ ఉండాల్సి వస్తుంది. బిల్‌కు క్రమశిక్షణ ఎక్కువ. పిల్లల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తుంటాడు. కొన్నాళ్ల తర్వాత బిల్ మద్యానికి బానిసై, ఒలివాను హింసిస్తుంటాడు. దాంతో ఒలివా, అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఇదంతా తెలుసుకున్న సీనియర్ మేసన్, ఒలివాకు సర్ది చెప్పి సమంత, మేసన్‌లను వేరే ప్రాంతానికి తీసుకువెళతాడు. మళ్లీ కొత్త జీవితం మొదలవుతుంది.

 ఒలివా వేరొకరితో సహజీవనం చేస్తుంది. మేసన్‌కు క్రమంగా ఫొటోగ్రఫీపై ఆసక్తి మొదలవుతుంది. ఒక పార్టీలో మేసన్, షీనా అనే యువతితో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఇద్దరూ జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. మేసన్‌కు షీనాతో త్వరగా బ్రేకప్ అవుతుంది. ఇంతకీ ఫొటోగ్రఫీలో మేసన్‌కు సిల్వర్ మెడల్ వస్తుంది. డిగ్రీ కూడా సాధిస్తాడు. సమంత, మేసన్‌ల భవిష్యత్ ప్రణాళికలను చర్చించడానికి ఒలివా వారిని లంచ్‌కు పిలుస్తుంది. గత జీవితం చాలా విఫలమైందనీ, అందుకే ఇల్లు అమ్మేస్తున్నాననీ ఒలివా చెబుతుంది. ఇంతలో మేసన్ చదువుకోవడానికి యూనివర్సిటీకి వెళతాడు. అక్కడ పరిచయమైన స్నేహితుడితో కలిసి నేషనల్ పార్క్‌కు వెళతాడు. ‘ఈ క్షణాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తూ ఉండాలి’ అని వాళ్లు అనుకోవడంతో సినిమాకు ‘శుభం’ కార్డు పడుతుంది.

 ఆయన రూటే  సెపరేటు!
 అమెరికన్ చలనచిత్ర దర్శకుడు, రచయిత అయిన యాభై అయిదేళ్ళ రిచర్డ్ స్టూవర్ట్ లింక్లాటర్ విభిన్న తరహా చిత్రాలను రూపొందిస్తుంటారు. ప్రేమ చుట్టూ తిరిగే కథతో ఆయన తీసిన ‘బిఫోర్ సన్‌రైజ్’ (1995), ‘బిఫోర్ సన్‌సెట్’ (2004), ‘బిఫోర్ మిడ్‌నైట్’ (2013)ల చలనచిత్ర త్రయం గురించి సినీ వర్గీయులు ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అదే నటీనటుల్ని తీసుకొని కొన్నేళ్ళ పాటు వాళ్ళను చిత్రీకరించడమనే పద్ధతిని ఆయన ఆ ట్రయాలజీలోనూ, ఈ ‘బాయ్‌హుడ్’లోనూ అనుసరించారు.

 సినీ దర్శకత్వానికి రాక ముందు అనేక సంవత్సరాలు ఆయన ఫిల్మ్ టెక్నిక్‌లకు అభ్యాసాలుగా, ప్రయోగాలుగా చాలా లఘు చిత్రాలు తీశారు. చిత్రం ఏమిటంటే, ఒక రోజులో జరిగిన కథగా సినిమాలు తీయడం ఆయన ప్రత్యేకత. ఇటీవలి కాలంలో ఆ రకమైన ఇతివృత్తాలు బాగా ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఇక, పన్నెండేళ్ళ పాటు ఆయన చిత్రీకరించిన ‘బాయ్‌హుడ్’ తాజాగా వార్తల్లో నిలిచింది. హాలీవుడ్ చిత్రాలు తీస్తున్నప్పటికీ, ఇప్పటికీ స్వస్థలమైన టెక్సాస్‌లోని ఆస్టిన్‌లోనే ఉండడం ఆయన విల క్షణత. సాంప్రదాయిక సినీ కథాకథన శైలికి భిన్నంగా వెళ్ళడం వృత్తిపరంగానూ లింక్లాటర్‌ను ఇతరులకు భిన్నంగా నిలుపుతోంది.
 

ఊహాశక్తికి పుస్తకమే మార్గం - సింగీతం శ్రీనివాసరావు

ఊహాశక్తికి పుస్తకమే మార్గం

Sakshi | Updated: May 24, 2015 00:07 (IST)
ఊహాశక్తికి పుస్తకమే మార్గం
పఠనానుభవం

కాలేజీ రోజుల్లో హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఓ వెయ్యి పేజీల పుస్తకం చదవడం కన్నా ఒక సినిమా చూడటం సులువు అనే ఆలోచ నతో సినిమాలు విపరీతంగా చూశాను. అప్పుడు పుస్తకాల విలువ నాకు తెలియదు.

నేను దర్శకుడి నయ్యాక స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు పుస్తకాల గొప్పతనం అర్థమయింది. సినిమాలో ఓ సన్నివేశం చూసేటప్పుడు మన ఊహాశక్తికి పని ఉండదు. ఎవరో ఊహించి అక్కడ  సన్నివేశం రాస్తారు. ఇక సినిమా చూసే ప్రేక్షకులు ఇంకేం ఊహించుకుంటారు! సన్నివేశంలో ఇక్కడ ఇల్లు ఉంటుంది, పిల్లి ఉంటుంది అని వాళ్లే చెప్పేస్తారు. అంతకు మించి ఊహించుకోవడానికి ఏమీ ఉండదు. కానీ పుస్తకం చదివేటప్పుడు ఇమేజినేషన్ పాళ్లు ఎక్కువ. పది మంది ఓ పుస్తకం చదివితే దానిని పదిరకాలుగా ఆలోచిస్తారు. 

నేను మొట్టమొదటిసారి చదివిన ఇంగ్లీషు పుస్తకం మార్క్ ట్వేన్ ‘ది ఎడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సాయర్’. చదివిన తర్వాత మా ఫ్రెండ్స్‌కు దాన్ని యథాతథంగా అప్పజెప్పా. నేను ఇంటర్మీడియట్‌లో ఉండగా ఓ అమెరికన్ దంపతులు తమ లైబ్రెరీ నుంచి వాళ్ల పుస్తకాలు ఇచ్చారు. అలా మార్క్ ట్వేన్ రచనలన్నీ చదివేశా. అలాగే, రాబర్ట్ లూయీ  స్టీవెన్‌సన్ నవలలు కూడా నన్ను బాగా ఆకర్షించాయి.

పెరల్ ఎస్ బక్ ‘ద గుడ్ ఎర్త్’ నాకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి. అందులో సంభాషణలు సహజంగా ఉంటాయి. నా అదృష్టం ఏంటంటే  నవల చదివాక దాని ఆధారంగా వచ్చిన సినిమా చూశా. చైనా వాళ్ల జీవిత విధానం ఎలా ఉంటుందో ఈ నవల కళ్లకు కట్టినట్లు చూపించింది.

హెమింగ్వే ‘ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ’ చాలా ఇష్టం. సముద్రంలోని మార్లిన్ అనే చేపకూ, ఓ జాలరికీ మధ్య జరిగే సంఘర్షణ ఈ నవల ఇతివృత్తం. ఎలిజబెత్ బోవన్ అనే నవలా రచయిత దీని గురించి మాట్లాడుతూ-‘ నాట్ ఎ వర్డ్ కెన్ బి రీప్లేస్‌డ్’ అని వ్యాఖ్యానించారు. ఈ నవల ఆధారంగా ఇదే పేరుతో  సినిమా తీశారు. కానీ నాకు ఆ సినిమా నచ్చలేదు. నవల చదువుతున్నప్పుడు కలిగిన అనుభూతి సినిమా చూస్తున్నప్పుడు కలగలేదు.
ఆ తర్వాత - నాకు నాటకాలంటే చాలా ఇష్టం. కాలేజీ రోజుల్లో జార్జ్ బెర్నార్డ్ షా నాటకాలంటే ఎగబడేవాళ్లం. ఆయన ‘పిగ్‌మాలియన్’ బాగా నచ్చింది. ఆలివర్ గోల్డ్ స్మిత్ రాసిన ‘షి స్టూప్స్ టు కాన్‌క్వర్’ నాటకం కూడా బాగా నచ్చింది.

తెలుగు విషయాని కొస్తే, కాళీపట్నం రామారావు, పాలగుమ్మి పద్మరాజు,  కొడవటిగంటి కుటుంబరావు రచనలు చాలా ఇష్టం. ముళ్లపూడి వెంకటరమణ రచనలు చాలా ప్రేరణ కలిగించాయి. ఇక, విశ్వనాథ సత్యనారాయణ ‘మా బాబు’ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను పెరిగి పెద్దయ్యేవరకూ కూడా ఆ కథలోని పాత్రలు, సన్నివేశాలు నా మనస్సులో అలా ముద్ర పడిపోయాయి. ఇప్పటికీ మరోసారి దాన్ని చదవాలనిపిస్తుంది.

- సింగీతం శ్రీనివాసరావు
  దర్శకుడు

స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌లు కావాలి

స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌లు కావాలి.. - సినీరచయిత K.L. ప్రసాద్‌ సినిమా అంటే మెగా ప్రాజెక్ట్‌. స్క్రిప్టు దశ నుంచే ఇక్కడ ఎంతో హార్డ్‌వర్క్‌ తప్పనిసరి. ఇంత చేసినా... ఏదో చిన్న పొరపాటు చేస్తే సినిమా ఫట్టే! అయితే స్క్రిప్టు, స్టోరీబోర్డింగ్‌ సరిగా ఉంటే సినిమా ఫలితం అనుకున్నట్టుగానే ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు సీనియర్‌ రచయిత కె.ఎల్‌.ప్రసాద్‌. రెండు దశాబ్దాలు పైగా ఈ రంగంలో కృషి చేసిన ఆయన స్క్రీన్‌ప్లే రచయితలకి సంబంధించిన గమ్మతె్తైన విషయాలు ఎన్నో చెప్పారు. అవేంటోచదవండి... klprashad రచయితలు... దర్శకనిర్మాతలకి కథ ఎలా చెప్పాలి? టాలీవుడ్‌లో రచయిత స్వయంగా కథ విని పించాలి. ఎవరైనా రచయిత 2 గంటల కథను వినిపించడానికి కనీసం మూడున్నర గంటల సమయం పడుతుంది. ప్రతిదీ విపులంగా చె ప్పాలంటే అంత సమయం వెచ్చించాల్సిందే. ఏదైనా పెద్ద విషయాన్ని చిన్నది చేసి చెప్పడం సులువు. బాగా చెప్పొచ్చు కూడా. కథను విస్తరించి చెప్పినప్పుడు అది మరీ అంత గొప్పగా అనిపించకపోవచ్చు. విజయేంద్రప్రసాద్‌, రామ్‌గోపాల్‌వర్మ, గుణశేఖర్‌... ఇంకా మన పరిశ్రమలోని పెద్ద రచయితలంతా కథలను చెప్పడంలో ఘనాపాటీలే. అలాగే ఇప్పుడున్న ట్రెండ్‌లో 5 నిమిషాలు, 10 నిమిషాలు కథ చెబుతా మంటే కుదరదు. దర్శక నిర్మాతలు, హీరోలు పూర్తిగా వింటామంటున్నారు. అదే హాలీవుడ్‌లో అయితే ఏ రచయిత అయినా స్క్రిప్టు రాసి దర్శకనిర్మాతలకు ఇచ్చేస్తారు. విజువల్‌ సెన్స్‌తో ఆ స్క్రిప్టు మొత్తాన్ని చదివి ఓకే చేసేస్తారు. ఇక్కడ అది కుదరదు. అలాగే రచయితకు హాలీవుడ్‌లో ఉన్న ప్రాధాన్యత ఇతర పరిశ్రమల్లో లేదు. రచయిత చెప్పిన కథ, స్క్రీన్‌ప్లే యథాతథంగా తెరకెక్కుతోందా? రచయిత చెప్పిన కథను యథాతథంగా తెర కెక్కే పరిస్థితి మనకి లేదు. కథ వినిపించినప్పు డు ఉన్న ఎమోషన్స్‌ దృశ్యీకరించేప్పుడు రావ ట్లేదు. స్క్రీన్‌ప్లేని మలచడంలో దర్శకులు విఫలమవుతున్నారు. దానివల్లే ఎన్నో సినిమా లు నేడు ఫ్లాపవుతున్నాయి. జయాపజయా లకు చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా ఉండదు. కథనం చూపించడంలో ఫెయిలయితే అంతే సంగతులు. సినిమా రచయిత ఏ విషయాలు పరిశీలించాలి? కథ రాసేవాడు, చెప్పేవాడు ఆలోచించాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. సినిమా ఏ ప్రేక్ష కుడి కోసం? బడ్జెట్‌ ఎంత? కథ ఎవరికి చె ప్పాలి? నటీనటుల ఇమేజ్‌లు ఏమిటి? ఇలా ఎన్నో కోణాల్లో ఆలోచించాలి. భాష, యాస, కులం, మతం, ప్రాంతం, సంస్కృతి... ఇలా ఎ న్నో విషయాలను పరిగణించాలి. మనకి నచ్చి న ‘శంకరాభరణం’, ‘గీతాంజలి’ హిందీలో ప్లాపవడానికి కారణాలు వెతకితే కొన్ని సంగతులు అర్థ మ వుతాయి. అలాగే రచయిత ప్రేక్ష కుడి సైకాలజీననుసరించి తన స్క్రిప్టును మలుచుకోవాలి. ప్రస్తుతం ఏం జరుగుతోంది? ఏదైనా సినిమాని నలుగురై దుగురు రచయిత లు కలిసి రాస్తారు. వాళ్ల పరిధిలోనే ఆ స్క్రిప్టుపై ఆలోచిస్తారు. అది ఎదుటివారికి తెలిసే అవకాశం లేదు. ముఖ్యం గా ఎవరు రాసింది వారికి గొప్ప. అందువల్ల కొన్ని లోపాలు బైటికి తెలియవు. అయితే ఏదై నా స్క్రిప్టును ఓ కన్సల్టెంట్‌ పరిశీలిస్తే... లోటు పాట్లు తెలుసుకునే అవకాశముంటుంది. కన్సల్టెంట్‌ ఫ్రెష్‌ బ్రెయిన్‌తో ఆలోచిస్తారు. దానివల్ల తప్పులు వెతకగలుగుతారు. అలాగే ప్రేక్షకులెప్పుడూ... సినిమాకి ఫ్రెష్‌ బ్రెయిన్‌తో వస్తారు. వారిని మెప్పించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. జయం-అపజయం దోబూచులాట వెనుక? ఒక సక్సెస్‌ ఇచ్చిన టీమ్‌ మరోసారి ఫెయిల్‌ అవుతోంది. ఎందుకు అని పరిశీలిస్తే... వారు మలిచిన స్క్రిప్టులో లోపాలను వెతిే కొత్త బ్రెయిను ఉండదు గనుక. పెద్ద దర్శకుడు, పెద్ద హీరో, పెద్ద... సంథింగ్‌ కలిసినా... అపజయమెదురయ్యేది కథ, కథనం లోపం వల్లే అనేది ఎవరైనా అంగీకరించి తీరాలి. అలాగే సినిమా అపజయానికి ఇంకా ఎన్నో కారణాలుంటాయి. అయితే అవన్నీ సెకండరీ. ప్రస్తుత వ్యాపకాలు? తెలుగు యూనివర్శిటీలో విజిటింగ్‌ ఫ్యాకల్టీ గా పనిచేస్తున్నా. నవతరం రచయితల కోసం... తరగతులు నిర్వహిస్తున్నాం. అక్కడ ప్రతి క్లాసు 3 గంల పాటు సుదీర్ఘంగా ఉం టుంది.
అదేగాక రచయితల సంఘం తరపున అప్పుడప్పుడు స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లు నిర్వహిస్తు న్నాం. ప్రపంచ సినిమా విశ్లేషణ సహా హాలీ వుడ్‌ సినిమాపై ఎన్నో విశ్లేషణలు ఈ క్లాసుల్లో ఉంటాయి. స్క్రీన్‌ప్లే రాయాలనుకునే ఔత్సాహి కులకు, ప్రారంభీకులకు సూచనలు చెబు తాం. ఈ తరహా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. డా పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మేం ఇటీవల నిర్వహించిన స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌ కు విశేష స్పందన వచ్చింది. 10 రోజులు, 3 రోజుల స్క్రీన్‌ప్లే వర్క్‌షాప్‌లు కూడా నిర్వహిస్తు న్నాం. ఈ తరగతుల వల్ల సినిమాని మననం చేసుకోవడం మాలో కొత్త ఎనర్జీని పుట్టిస్తుంది కూడా. ప్రఖ్యాత చిత్రాలు... అనార్కలి, మొ ఘల్‌-ఎ-అజమ్‌ క్లాసులు చెప్పడానికి ఏకం గా 5 క్లాసులు పైనే పడతాయి. ప్రస్తుత ప్రాజెక్టులు? ప్రస్తుతం ఓ 8 సినిమాల్లో సహాయనటుడిగా చేస్తున్నా. ఓ 2 సినిమాలకు రచయితగా పని చేస్తున్నా. ఇకముందు నటన సహా రచయిత గా నూ కొనసాగుతాను. అలాగే దర్శకత్వం ఆ లోచన కూడా ఉంది. నా సినిమాకి స్క్రిప్టే హీరో. సినిమా రంగం వ్యవస్థీకృతం కాదెందుకు? సినిమా రంగం సంస్థాగతం కాదు. ముఖ్యం గా ప్రొడక్షన్‌ విభాగం వ్యవస్థీకృతం కానేరదు. సృజనపై ఆధారపడిన ఈ రంగంలో ఉద్యోగం చేస్తామంటే కుదరదు. లక్షల జనాలు చూసే సినిమాని ఓ టీమ్‌ కలిసి రూపొందిస్తుంది. ఆ టీమ్‌ తర్వాత కలిసి పనిచేయొచ్చు. లేదా విడిపోనూ వచ్చు. ఒకేచోట ఉండే అవకాశా లు అరుదు. ఎవరి ప్రతిభని బట్టి వాళ్లకు అవకాశాలొస్తాయిక్కడ. సురేష్‌ ప్రొడక్షన్స్‌ లాంటి కొన్ని సంస్థలు ప్రతిభను ఓ బ్యాంకులా తయారు చేస్తుంటాయి. అలా అన్ని సంస్థలు చేయలేవు. స్వ విషయం ? పుట్టి పెరిగింది ఒరిస్సాలో. ఎలక్ట్రికల్‌ ఇంజి నీర్‌గా ప్రభుత్వోద్యోగం చేశాను. ఆ క్రమం లోనే సినిమా అంటే ఆసక్తి. అయితే అక్కడ సినిమా అందుబాటులో లేదు అప్పట్లో. దాం తో దేశంలో ఎక్కడ ఏ చలనచిత్రోత్సవాలు జరిగినా ఆసక్తిగా వెళ్లేవాడిని. అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పాల్గొనేవాడిని. సొం తంగానే సినిమాపై అభ్యసించేవాడిని. ఆ వి జ్ఞానంతోనే 1987లో మద్రాసు వెళ్లాను. అ క్కడ దర్శకనిర్మాతల పరిచయాలతో రచయి తగా ప్రారంభమయ్యాను. ఎం.వి.రఘు ‘కళ్లు’ చిత్రానికి తొలిసారి రచనాసహకారం అని టైటిల్స్‌లో నా పేరు వేశారు. రాశేఖర్‌ ‘మగాడు’ చిత్రానికి సంభాషణల రచయిత గా గుర్తింపొచ్చింది. ఆ తర్వాత ఎన్నో చిత్రా లకు రచయితగా కొనసాగాను. భవిష్యత్‌...స్క్రీన్‌ప్లే కన్సల్టెంట్‌దే! సినిమా గెలుపోటములపై విశ్లేషించడం అనే ది గొప్ప ప్రక్రియ. దానికి రచయితకు ఎంతో అను భవం అవసరం. ఎన్నో సినిమాలకు పని చేస్తేనే కానీ అది సాధ్యపడదు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్ప త్రిలో బాడీ స్కాన్‌ చేసినట్లుగా స్క్రి ప్టుని స్కాన్‌ చే యగలగాలి. అప్పుడు దానిలో ని లోపాలు దొరు కుతాయి. అలా నేను విశ్లే షించిన ఓ 4 సినిమాల స్క్రిప్టులు తర్వాత కరె క్షన్‌కి వెళ్లి ఉత్తమ ఫలితాలు అందుకున్న సందర్భాలున్నాయి. ఆ కోణంలో ఆ లోచిస్తే ‘స్క్రీ న్‌ప్లే కన్సల్టెంట్‌’ అనే కార్డుతో పనిచే యాలనే కొత్త ఆలోచన వచ్చింది. ఏదైనా సినిమాకి సంబంధించిన బౌండ్‌ స్క్రిప్టును దర్శకరచయితలు చెబితే దానికి కన్సల్టెంట్‌గా కొనసాగుతాను. గతం లో ఈ తరహాలో అవకావం వచ్చినా అప్పుడు నిరా కరించాను. తాజాగా ఆ ప్రయత్నాన్ని నేనే ఆరంభి స్తున్నా. దీనివల్ల సిని మాకి మేలు జరుగుతుందనే ది నా యోచన. అమీర్‌ఖాన్‌ ‘రంగ్‌ దే బ సంతి’ స్క్రిప్టును ప్రఖ్యాత హాలీవుడ్‌ స్క్రీన్‌ప్లే రచయిత సిడ్‌ ఫీల్‌‌డ్సకి చూపించి సరిచేయించారు. ఆ సినిమా ఫ లితమేమిటో అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఓ విషయాన్ని చెప్పాలి. సినీకార్మికుల ‘చిత్రపురి కాలనీ’ని ప్రఖ్యాత ఐవిఆర్‌సిఎల్‌ కంపెనీ కాంట్రా క్టు కుదుర్చుకుంది. అయితే దానికోసం ఎంతో ఖ ర్చు చేసి కన్సల్టెంట్‌ను నియోగించుకున్నారు. ఎం దుకంటే గృహ నిర్మాణం అనేది ఓ పెద్ద ప్రాజెక్ట్‌. పొరపాటు జరగకుండా ముందే జాగ్రత్త పడాలి. నిర్మా ణంలో ఏ లోటు పాట్లు లేకుండా చూసుకో వాలి. అలాగే సినిమా కూడా ఓ ప్రాజెక్ట్‌. ఎవ రికీ నష్టాలు రాకూడదు. అయితే సినిమాని విశ్లేషించే కన్సల్టెంట్‌లకు అసాధారణ పరిజ్ఞానం ఉండాలి. ( సూర్య దినపత్రిక సౌజన్యంతో.....)

Wednesday, January 1, 2014

ALAMODALAINDI


Strong opening scene or sequence  that will immediately grab the attention of the audience .
ఆశిష్ విద్యార్థి  నాని కొట్టడం ..సినిమా చూడడానికి వచ్చిన వాడ్ని త్వరగా కధ లోకి లాగడం .. Incident  ద్వారా జరిగింది ..

Introduce the hero before the romantic rival. Readers  and audience instinctively identify with the first character who appears on the screen. 
నాని ప్రేమకధ స్టార్ట్ చేస్తూ  అతని Failured  లవ్ స్టొరీ చెబుతారు ... ఇక్కడ నాని క్యారెక్టర్   పరిచయం  చిన్న సానుభూతి తో  స్టార్ట్ చేస్తారు ...


Introduce the main character relations and friends .
నాని మదర్  క్యారెక్టర్  పరిచయం  తర్వాత  ఫ్రెండ్స్  పరిచయం అవుతారు ..అది కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ...
Show the first meeting between the hero and heroine .
నాని లవ్ ఫెయిల్ అయ్యింది .. ఆమ్మాయి పెళ్లికే  వెళ్ళాడు ..బాధ పడ్డాడు ..మందు కొట్టాడు ...తన లాగే లవ్ ఫెయిల్ అయిన నిత్య ని కలిసాడు ... తన  చేతి bracelet ని plot device గా వాడారు ...పాట పాడుకున్నారు..విడిపోయారు ...
Main character  and his love journey must be continued hilariously  otherwise audience  feel bore .
రెండు సీన్ తర్వాత  నాని నిత్య  మళ్ళీ  క్లబ్  లో కలిసిపోయారు ..ఇక జర్నీ స్టార్ట్ అయ్యింది ..ప్రేక్షకుడు  జర్నీ ని ఇష్టపడతాడు ..లేక పోతే బోర్  ఫీల్ అవుతాడు ..
Knowing your character’s points of view  becomes a good way to generate 
conflict . 
  
నాని సిమ్రాన్ ని ప్రేమించి లవ్ లో ఫెయిల్ అయ్యాడు ...ఇంటర్వల్  కి వచ్చే సరికి మళ్ళీ దీపక్ అనే క్యారెక్టర్ నిత్య లైఫ్ లో ఉన్నాడని.. Engagement కూడా అయ్యిందని  తెలిసి  నాని "తన మనసులో  ప్రేమ  " చెప్పకుండా దాస్తాడు… ఇక్కడే  నాని క్యారెక్టర్ కి చిన్న "సంఘర్షణ " పెట్టారు ..దానితో  నాని లవ్  ఫెయిల్ అవుతుందా ? అనే బాధ ప్రేక్షకుడి లో కలుగుతుంది ...
 Create problems in love :
నాని ని అతని మదర్ తిరిగి మామూలు మనిషిని చేస్తుంది ...
మరి నిత్య పరిస్థితి ఏమిటి ? అక్కడ దీపక్ తో Engagement  బ్రేక్ అయ్యింది ..దాన్ని Flash back తో చెబుతారు ..దీపక్ క్యారెక్టర్ ని చాలా పాజిటివ్ గా మలిచారు ..
ఇక్కడ నాని కి స్నేహవుల్లాల్ అనే చిన్నప్పటి ఫ్రెండ్ వుంది ..ఆమె తో Engagement  అనుకుంటారు ...

అనుకోకుండా నిత్య ని -నాని తన వృత్తి వలన కలుస్తాడు ..నిత్య ని ఇంటికి తెస్తాడు నాని ...నిత్య తన ప్రేమను చెబుదామని అనుకుంటుంటే ..స్నేహ ఉల్లాల్ తో నాని కి Engagement    అని తెలుసుకుని  నిత్య వెళ్లి పోతుంది ...
నాని ని "గే " అనుకోవడం వలన స్నేహ ఉల్లాల్  తో Engagement  బ్రేక్ అయ్యింది ...
నాని -నిత్య  ఇద్దరూ ప్రేమను చెప్పుకోలేక అవస్థ పడతారు ...ఇంతలో నాని మదర్ చనిపోవడం ...నిత్య  వచ్చేసరికి స్నేహ ఉల్లాల్  వుండటం ...అది చూసి నాని కి పెళ్లి అయ్యిందని నిత్య వేరే పెళ్ళికి సిద్దపడటం  జరుగుతుంది ...
Hero has to win back the love of his life and achieve his destiny..
నాని ఫ్రెండ్స్ సహాయం తో నిత్య పెళ్లి ఆపాలనుకుంటే ..మధ్య లో ఆశిష్ విద్యార్థి  ఇలా కిడ్నాప్ చేసాడని స్క్రీన్ ప్లే చెప్పారు ...అప్పుడు ఆశిష్ విద్యార్థి  నాని కి హెల్ప్ చేయడం బాగుంటుంది ..
Main character  always face the struggles.
...నాని పెళ్లి ఇంట్లో కి వెళ్లేసరికి  తాగుబోతు రమేష్ రావడం ..కధ పరుగులు పెట్టడం ..Climax కి చేరడం ...నాని నిత్య కలవడం



Asset -1  
Create a character  and you’ll create a story ..
సినిమా కధ థిన్ లైన్..దీనికి ఎన్నో ఇన్సిడెంట్స్  రాసుకోవాలి ..ఎన్నో సీన్ లు రాసుకోవాలి ... creative  ప్రాసెస్  లో కొన్ని క్యారెక్టర్ లు కధ  కి అవసరం  పడతాయి ..అటువంటివే  దీపక్,స్నేహ ఉల్లాల్ ,తాగుబోతు రమేష్ ,ఆశిష్ విద్యార్థి క్యారెక్టర్ లు ..
ఇంత మంచి సీన్ లు వున్న  కధ ని straight Narration  చేస్తే  ఏమి ఇంట్రెస్ట్  వుండదు ..అందుకే  స్క్రీన్ ప్లే Narration  చేసారు .. హీరో కధ నడపడు..క్యారెక్టర్ లు ,పరిస్థితులు  కధ ను నడుపుతాయి ...అందుకే మాములుగా మన మధ్య జరిగే కధ లా  వుంది .ప్రతి సినిమా లోను హీరో నే కధ నడపాలి ,హీరో నే హై లెట్ అవ్వాలి అనే రూల్స్  ని పక్కన పెట్టారు ...
Before writing every scene in the script , judge whether it is useful or not .
సీన్ లు  చేసేటప్పుడు

టైం పాస్ గా నవ్వుకోడానికా ?


స్టొరీ లైన్ ముందుకు నడపడానికా ?
 






 
క్యారెక్టర్ ని ప్రేక్షకుడి కి దగ్గర చేయడానికా ?

క్యారెక్టర్ ని Elivate చేయడానికా ?
  ఇలా అన్ని విధాలా అలోచించి సీన్ లు రాసుకోవాలి ..అలా రాసుకున్నారు కాబట్టే సినిమా అంత హిట్ అయ్యింది ... పెట్టిన పెట్టుబడికి  నాల్గింతలు collect  చేసింది ..
Asset -2
నాని -నిత్య  బాగా నటించారు ... ఇద్దరు  క్యారెక్టర్ లే సినిమా కి బలం ..నాని మదర్ క్యారెక్టర్ ,నిత్య ఫాదర్ క్యారెక్టర్  లు  వాళ్ళు కుడా బాగా చేసారు ...చివరిగా వచ్చే తాగుబోతు రమేష్ క్యారెక్టర్  సినిమా ని Climax  లో నిలబెట్టింది ..




Asset -3
మాటలు చాలా బాగా రాసారు లక్ష్మి భూపాల్ ...మన లైఫ్ లో మాట్లాడుతున్నట్టు  వున్నాయి...ఇవి రాయాలంటేనే కష్టం ...
Asset-4
సినిమా లో 3 పాటలు  బాగున్నాయి ..
ఏదో అనుకుంటే  ఇంకేదో జరిగిందే ...
.అమ్మమ్మో ..అమ్మో అమ్మాయి అంటే ...
బేబీ బేబీ  క్లబ్  సాంగ్  లు స్టొరీ లో కలసి పోయి మంచి ట్యూన్  లతో అలరిస్తాయి
Set up :
1.1st half లో నాని ని "గే " అని చూసిన  క్యారెక్టర్ లను 2nd half   లో వాడుకుని  స్నేహ ఉల్లాల్ తో Engagement   బ్రేక్  చేయడం  బాగుంది ..హీరో ప్రమేయం  లేకుండా  హీరోని అవమానిస్తే  ప్రేక్షకుడు  ఫీల్ అవుతాడు ,...సానుభూతి వస్తుంది ...
2.అన్ని క్యారెక్టర్ లు పరిస్థితుల  ప్రకారం స్పందిస్తాయి
 
a) నిత్య కి దీపక్ కి Engagement  అయ్యిందని  నాని -నిత్య కి దూరం అవుతాడు
 
b) ఇంట్లో అందరు "గే " అంటున్నారని స్నేహ ఉల్లాల్  నాని ని వద్దనుకుంటుంది
 
c) స్నేహ ఉల్లాల్ నాని కి పెళ్లి అయ్యిందని నిత్య దూరం అవుతుంది ...
ఇలా అన్నీ ఆయా పరిస్థితుల ప్రకారం  స్పందిస్తాయి ..ఇదే కృష్ణ వంశి సినిమాలు -సింధూరం ,అంతః పురం ,ఖడ్గం  లలో చూస్తాం ...అతని శిష్యురాలు అయిన నందిని రెడ్డి  రొమాంటిక్ కామెడి తీయడం విశేషం ...
Creative clue :


“In July “అనే సినిమా ఒకటి వుంది ..మంచి జర్నీ వున్న లవ్ స్టొరీ ఫిలిం .. స్క్రీన్ ప్లే  ఇందులో గమనించ వచ్చు ..ఆశిష్ విద్యార్ధి  క్యారెక్టర్  ఇలానే  పుట్టి ఉండొచ్చు ... సినిమా కూడా బాగుంటుంది చూడండి...






Logic problems :
If there are holes in the story, don’t worry there are also holes in life . the question to ask is :” will the audience notice it “….
1.“ఫోన్ లో మాట్లాడుకుంటే సరిపోతుంది  కదా " అని చాలా సార్లు అనిపించినా పరిస్థితుల్లో  మనిషి అలా అనుకోని ఉండొచ్చు  అని సరిపెట్టుకోవచ్చు ....నిత్య ఫోన్ వాడను అని ముందే చెప్పేస్తుంది ..
2.బెంగుళూరు  టు హైదరాబాద్  నిత్య  తిరుగుతూనే వుంటుంది ..అందుకే జర్నీ  ఎక్కువసేపు పెట్టలేదు ...సీన్లు వరసగా వెళ్ళిపోవడం వలన story holes  కనపడవు ..లాజిక్ వెతికే సరికి  సినిమా కధ ముందు కెల్లిపోతుంది...రాఘవేంద్ర రావు గారు ..రాజమౌళి చేసేది ఇదే ...