ఏకాలంలో అయినా డబ్బుకు లైను వేసి దానిని ఎత్తుకెళ్లేవాడు ఉంటాడు లోకంలో. అలాంటివాణ్ణి రాబిన్‌హుడ్ అంటారు. డబ్బున్నవాళ్లను కొట్టి పేదవాళ్లకు పెట్టే రాబిన్‌హుడ్‌కు ప్రజలలో ఎప్పటికీ తరగని క్రేజ్. జెంటిల్‌మెన్‌లో అర్జున్ చేసింది అదే. పెద్దపెద్దవాళ్ల డబ్బును దొంగిలించి పేదవాళ్ల కోసం యూనివర్సిటీని కట్టాడు అర్జున్. తాజాగా ‘కిక్’ సినిమాలో రవితేజా చేసింది కూడా అదే. బడాబాబుల జేబుకొట్టి ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడే పేదపిల్లల కోసం హాస్పిటల్ కట్టిస్తాడతడు. ఇక శివాజీ అయితే ప్రతి ఊరినీ స్వర్గం చేయడానికి ఏకంగా దేశంలోని నల్లధనం మీదే దండెత్తాడు.
అమెరికాలో కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేసి 250 కోట్ల రూపాయల మొత్తంతో మన దేశంలో పెద్ద మెడికల్ కాలేజీ కట్టాలనే ఆశయంతో వస్తాడు శివాజి. తద్వారా పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందించాలని కలలు కంటాడు. కాని కాలేజీలు పెట్టి విద్యను వ్యాపారంగా చూసే ఆదిశేషుకు అది నచ్చదు. అందుకని శివాజీ ప్రయత్నాలకు అడ్డుపడుతుంటాడు. తన పలుకుబడిని ఉపయోగించి శివాజీ కట్టిస్తున్న కాలేజీకి పర్మిషన్లు రద్దు చేయించి, దాన్ని నేల కూల్చివేయిస్తాడు. శివాజీని అరెస్టు చేయించి జైల్లో పెట్టించి చిత్రహింసలకు గురి చేస్తాడు. అయినా శివాజీ భయపడడు. గుంపులు గుంపులుగా ఉండే ఇలాంటి విలన్‌లపై సింహంలా సింగిల్‌గా కలబడతాడు. మూటలు మూటలుగా పేరుకొని ఉన్న నల్ల డబ్బును వెలికి తీయిస్తాడు.
No comments:
Post a Comment