మనిషి బతకడానికి తిండి కావాలి. నీళ్లు కావాలి. ఇల్లు కావాలి. బట్ట కావాలి. ఇంకా చదువుకీ, తిరుగుడికీ, పెట్రోల్‌కీ, సరదాలకీ, సంతోషాలకీ, మిఠాయిలకీ, పెళ్లిళ్లకీ, పండుగలకీ... ఒక్కటని కాదు, ఈ భూప్రపంచం మీద మనిషి అడుగు తీసి అడుగు వేయాలంటే... కావలసింది డబ్బు.
డబ్బు ఉంటేనే మనిషికి బతుకు.
డబ్బు ఉంటేనే మనిషికి విలువ.
డబ్బు ఉంటేనే మనిషికి పవర్.
ఒక్క మాటలో చెప్పాలంటే...
డబ్బే మనిషిని ఛార్జ్ చేస్తుంది. డబ్బు సంపాదించినప్పుడే మనిషి రీఛార్జ్ అవుతాడు.
*****
సుమారు యాభై ఏళ్ల కిందట... ముంబైలోని ఓ రద్దీ రోడ్డులో... చెట్టు కింద చిన్న టీ కొట్టు. అక్కడే చాయ్ అమ్మేవాడొక సేఠు. దారినపోతూ టీ తాగడానికి ఆగేవాళ్లతో చెలాకీగా కబుర్లు చెబుతూ వాళ్లను హుషారెత్తిస్తూ చాయ్ అమ్మేవాడు. అలా అతని దగ్గర టీ తాగేవారిలో ఒక వ్యక్తి మాత్రం రోజూ వచ్చేవాడు. నెత్తిన బట్టల మూట పెట్టుకుని, ఒక్కోసారి నడి మధ్యాహ్నం వేళ నడుచుకుంటూ, ఒక్కోసారి సైకిల్ తొక్కుకుంటూ ఆ టీ కొట్టు దగ్గరే ఆగేవాడు. ఆ కుర్రాడి అవస్థ చూసి సేఠు జాలిపడి ఫ్రీగా చాయ్ ఇచ్చేవాడు. ఎండలో తిరిగి తిరిగి అలసి ఉన్న ఆ కుర్రాడికి చాయ్ కాదు సాంత్వన. సాటి మనిషి తన కష్టాన్ని గుర్తించడమే గొప్ప ఊరట. ఆ గుర్తింపు కోసమే వచ్చేవాడు ఆ కురవ్రాడు. క్రమంగా అలా కొన్నాళ్లు వచ్చి... ఆ తర్వాత అటుగా రావడం మానేశాడు. ఆ చిన్న టీ కొట్టును చూసుకుంటూ సేఠు అలాగే ఉండిపోయాడు. ఓ రోజు ఓ ఖరీదైన కారు ఆ కొట్టు ముందు ఆగింది. అందులోంచి దిగాడు ఓ ఖరీదైన పెద్దమనిషి. నేరుగా సేఠు దగ్గరకు వచ్చి చాయ్ ఇమ్మని అడిగాడు. దగ్గరగా చూసి అప్పుడు గుర్తుపట్టాడా సేఠ్ - అతను గతంలో తన దగ్గర టీ తాగిన కురవ్రాడు. ఇప్పుడు పెద్దవాడయిపోయాడు. ధనికుడయ్యాడు. అయినా తనను మర్చిపోలేదు అతడు. గతంలో తాను ఫ్రీగా చాయ్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా... అతను అదే స్థలంలో కొత్త టీ స్టాల్‌ని పెట్టుకోడానికి బోలెడంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడక్కడ ఓ పెద్ద టీ కార్నర్ వెలిసింది.
ఆ ధనికుడు - ధీరూభాయ్ అంబానీ.
కనుక ఇవాళ లేనివాడు కదా అని చులకనగా చూడకూడదు. ఏమో.. ఎవరు చూడొచ్చారు.. రేపెపుడైనా అతడికి జాక్‌పాట్ తగుల వచ్చు. లక్షలు వచ్చి పడవచ్చు. అతడు పడవలాంటి కారులో వచ్చి ఉంచు అని ఒక సూట్‌కేస్ మనకు యివ్వొచ్చు. బీ కేర్‌ఫుల్.
No comments:
Post a Comment