ఇంకొక బాపతు వాళ్లు ఉంటారు. వీళ్లకు డబ్బు సంపాదించే సకల శక్తియుక్తులూ ఉంటాయి. అయినప్పటికీ సంపాదించరు. లక్ష్మీదేవి ఉన్నపళంగా వచ్చి వొడిలో కూర్చోవాలని కలలు గంటారు. లక్కు రావాలంటారు. జాతకాలను నమ్ముకుంటారు. అలాంటివాడే అటుకుల చిట్టిబాబు.
పనిని దైవంగా భావించి కష్టపడి పైకొచ్చిన రొయ్యల నాయుడు కూతురు రంభ అటుకుల చిట్టిబాబుని ప్రేమిస్తుంది. చిట్టిబాబుకు జాతకాల పిచ్చి. ఆఫ్టర్ వన్ ఇయర్ నువ్వు కింగ్ అయిపోతావని ఎవరో జ్యోతిషుడు చెప్పడంతో అదే నిజం అని నమ్మి ఏ పనీ చేయకుండానే తనకు రాబోయే రాజయోగం గురించి కలలు కంటూ కాలక్షేపం చేస్తుంటాడు. ఇతనిలో తెలివి ఉంది కాని దానిని వాడటం లేదు అని గ్రహించిన రొయ్యలనాయుడు తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయడానికి లక్ష ఎదురుకట్నం అడుగుతాడు. పెళ్ళి అయ్యాక ఆ లక్ష ఇస్తేనే శోభనం అని అడ్డు నిలుస్తాడు. చిట్టిబాబు అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాలన్నీ అతనికే ఎదురు తగులుతాయి. చివరకు తల్లి, చెల్లెలు కూడా అవమానాల పాలై, చిట్టిబాబుని ఈసడించుకోవడంతో బుద్ధి తెచ్చుకుని తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి లక్ష రూపాయలు సంపాదిస్తాడు. చెల్లెలి పెళ్లి చేయించి, తన కాపురాన్ని నిలబెట్టుకుంటాడు. ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా కథ ఇది!
కొంతమందికి అవమానమే అచ్చుయంత్రం. ఆ అవమానం అయ్యాకే ఆ అచ్చుయంత్రం నుంచి నోట్ల కట్టలు పుట్టుకొస్తాయి.
గారడీలను మించిన గారడీ... ఇంద్రజాలాన్ని మించిన మాయాజాలం... డబ్బు. ఈ డబ్బు కళ్లజోడు పెట్టుకుని చూస్తే లోకమంతా ‘పచ్చ’గా, వెచ్చగా, తియ్యగా కనిపిస్తుంది. ‘మనీ’ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు అందుకే. మనీ మేక్స్ మెనీ ఫేసెస్ కూడా.
మనీ సినిమాయే చూడండి. ఇద్దరు హీరోలు... జె.డి. చక్రవర్తి, చిన్నా. ఇద్దరికీ ఆస్తిపాస్తులు లేవు. బిర్యానీ కాదు కదా, ప్లేటు మీల్స్‌కే వెతుకులాట. ఇంటద్దె కట్టలేక దొంగచాటుగా రూమ్‌లోకి అప్ అండ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి. ఉద్యోగాల వేటలో తిరిగి తిరిగి అలసిపోయిన వీరిద్దరికీ పక్కింటి ఆంటీ జయసుధ ‘మహాలక్ష్మి’లాగా కనిపిస్తుంది. ఆమె నడుస్తుంటే కోటి రూపాయల బ్యాంక్ లాకర్‌లా అనిపిస్తుంది. బాగా డబ్బున్న ఆమెను కిడ్నాప్ చేస్తే తమ కథ సుఖాంతం అవుతుందని జేడీ, చిన్నా ప్లాన్ చేస్తారు. మొత్తానికి కిడ్నాప్ చేస్తారు. మరో వైపు జయసుధ భర్త పరేశ్ రావెల్ ఎలాగైనా ఆమెను అడ్డు తప్పించి మొత్తం ఆస్తంతా సొంతం చేసుకోవాలని ప్లాను.
డబ్బు... మనుషుల్ని ఎలా మార్చివేస్తుందో కొత్తగా చూపించిన సినిమా మనీ. చేసిన తప్పును
No comments:
Post a Comment