డబ్బు చేతికి అందలేదే అనుకోవడం వల్ల వచ్చిన బాధ కంటే చేతికి అందిన డబ్బు చేజారితే వచ్చే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది.
‘క్షణక్షణం’లో పరేశ్‌రావెల్ ఎంతో ప్లాన్ చేసి బ్యాంకును కొల్లగొట్టాడు. కోటి రూపాయలు వచ్చాయి. కాని అవి వచ్చినంత సేపటిలో మాయమయ్యి హీరో హీరోయిన్‌లకు దొరికాయి. ఇక అక్కడి నుంచి సాగే వేట చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కామెడీగా ఉంటుంది.
‘నేను వందరూపాయలకు కూడా మర్డర్ చేసిన సందర్భాలున్నాయి’ అంటాడు పరేశ్‌రావెల్. అలాంటి వ్యక్తి కోటిరూపాయల కోసం ఎంతకైనా తెగిస్తాడు.
కోటి- కొండమీది కోతినైనా తెచ్చుకోవచ్చు.
ఐదు నక్షత్రాల పూటకూళ్ల ఇంట్లో దిగొచ్చు. సొంతవిమానం మాట్లాడుకొని ఆకాశంలో షికారు చేయవచ్చు.
ఇన్ని డబ్బు ఇస్తుంది కాబట్టే అదంటే అంత వెర్రి.
ఆ వెర్రిలో పడి మనిషితనాన్ని మర్చిపోకూడదు కదా. అదే మనం గుర్తు పెట్టుకోవాల్సిన నీతి.
No comments:
Post a Comment