‘జానే నాతు.. యా జానే న’.. సినిమా చూశారా? ఇమ్రాన్‌ఖాన్ - జెనీలియా డిసౌజా ‘కెమిస్ట్రీ’కి తగ్గట్టు మలిచిన దర్శకుడు అబ్బాస్ తైర్వాలాని అభినందించకుండా ఉండలేం. మరి ఈ సినిమాకి వెళ్లే ముందు ఆ మాత్రం ‘ఎక్స్‌పెక్టేషన్స్’ ఉంటాయి. ఇక ఎ.ఆర్.రెహమాన్ సుమధుర సంగీతం. రెండేళ్ల తర్వాత మళ్లీ తెర మీదికి వస్తున్న అబ్బాస్ - రెహమాన్‌ల చిత్రం ‘అబద్ధం’గా మిగిలిపోతుందా? లేక ప్రేక్షకుల ఊహ నిజమవుతుందా? ఐతే - మొట్టమొదటిగా చెప్పొచ్చేదేమిటంటే - ఏ సినిమాకి ఆ సినిమానే. ఈ సినిమాకి ఈ సినిమానే. అన్ని కథలు ఒక్కలా ఉండవు అన్నది. సింగిల్ లైన్ (వన్ లైఫ్) స్టోరీకి ఎన్నో అంశాలను అతికించటంలో అక్కడక్కడ తడబడ్డా.. స్లో మోషన్‌లో గాడిలో పడింది. ఇటీవలి కాలంలో వస్తున్న బాలీవుడ్ చిత్రాలన్నీ విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకోవటం వెనుక ఉన్న కారణాల్ని పరామర్శించకుండా (ఉదా.అంజానె.. అంజాని - హౌస్‌ఫుల్.. ఒకటి కాదు (?) ఎన్నో.) లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అన్న రైమ్ దగ్గరికి వెళ్దాం. (అంజానె అంజాని కథ కూడా బ్రిడ్జి దగ్గరే మొదలై బ్రిడ్జి దగ్గరే ముగుస్తుంది. ఆత్మహత్యల కానె్సప్ట్ బ్రిడ్జి కానె్సప్ట్ అక్కడా ఇక్కడా ఒక్కటే. తప్పు ఎవరిదో తెలీదు).
సింగిల్ లైన్ కథలో - సిద్దార్థ (జాన్ అబ్రహాం) జీవితం సింపుల్‌గా నడిచిపోతూంటుంది. ‘కాగజ్ కే ఫూల్’ సెకండ్ హ్యాండ్ బుక్‌స్టాల్ నడుపుతూ అతడితోపాటు కాసినోవా ఉదిత్ గుజ్జు అమిత్, పాకిస్తానీ ఒమర్, అతడి ప్రెగ్నెంట్ చెల్లెలు అలియా, అలియా బాయ్‌ఫ్రెండ్ నిక్.
‘దోస్త్ ఇండియా’ అనే హెల్పింగ్ ఆర్గనైజేషన్ కరపత్రంలో సిద్దార్థ ఫోన్ నెంబర్ ప్రింట్ అవుతుంది. ఆ ఆర్గనైజేషన్ ‘ఆత్మహత్య’లు చేసుకోబోతున్న వారికి ఉచితంగా కౌనె్సలింగ్ చేస్తుంది. ఇకనేం? అన్ని కాల్స్ సిద్దార్థకి వచ్చేస్తూ అర్ధరాత్రిళ్లు ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒకరోజు మిష్కా (పాఖీ) సిద్దార్థకి ఫోన్ చేస్తుంది. ఆమె కథ చెబుతుంది. బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడంటుంది. ఇక్కడ్నుంచీ కథ ఎంతో ‘స్లో’గా నడుస్తూ రొమాంటిక్ కామెడీలోకి దిగుతుంది. ఒక్కో పాత్ర ఒక్కో సమస్యతో సతమతమవుతూ కామెడీని సృష్టిస్తుంది. ‘్ఛజ్ యువర్ లవ్ బిఫోర్ ఇట్స్ టూ లేట్’ అన్న కోణంలో క్లైమాక్స్‌కి చేరుతుంది. మిష్కా తన బాయ్‌ఫ్రెండ్ కరీం (మాధవన్)ని కలిసిందా? సిద్దార్థగా పరిచయమైన ఫోన్ ఫ్రెండ్ ‘్ఫదా’ పరిస్థితి ఏమిటి? మిష్కా చివరికి ఎవరిని కోరుకుంది? అన్న ప్రశ్నలను చివరికంటా కొనసాగిస్తే ‘ఝూఠా హి సహి’ ముగుస్తుంది.
తాజాగా రిలీజవుతున్న చిత్రాలన్నింటిలోనూ ఏదో ఒక సీరియస్ కానె్సప్ట్‌ని తీసుకోవటం.. దాని చుట్టూ కథ అల్లుకోవటం (అంజానె.. అంజానీలో ‘ఆత్మహత్యల’ నేపథ్యం - క్రూక్‌లో ‘్భరతీయులపై ఆస్ట్రేలియన్ల దాడి’.. నాకౌట్‌లో బ్లాక్ మనీ) ఇది మంచి పరిణామం. కాకపోతే క్లైమాక్స్ లన్నీ ఎయిర్‌పోర్ట్ నుంచి బ్రిడ్జ్‌ల దగ్గరికి మారినట్టున్నాయి. అదీ కూడా మారితే బావుణ్ణు.
లండన్ లొకేషన్స్.. కెమెరా వర్క్‌తో కన్నుల పండువగా ఉన్నాయి. ఎ.ఆర్.రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. పాటలు వినసొంపు. జాన్ అబ్రహాం నటన ఓకే. కృతికగా మానసి స్కాట్ ఫర్వాలేదు. కేరెక్టర్ లెంగ్త్ తక్కువ. పాఖీ నటన కూడా ఓకే. బాలీవుడ్ సినిమాల్లో కనిపించే ప్రేమ ‘సెంటిమెంట్’ ఈ చిత్రంలోనూ మనసుని టచ్ చేసింది
No comments:
Post a Comment