రాకొడితే ఏమవుతుంది..కిక్కు తలకెక్కుతుంది. అదే రెండు ‘రా’లు కలిపికొడితే ఏమవుతుంది..మరింత కిక్కెక్కుతుంది. బృందావనం సినిమా విషయంలో జరిగిందిదే. కలిసుందాం‘రా’... బావగారూ బాగున్నా‘రా’ అనే రెండు సినిమాలు కలిపితే, ‘బృందావనం’ అవుతుంది.
తెలుగు సినిమా ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో...ఎందుకు నచ్చుతుందో... ఎలా ఆలోచిస్తారో అన్నది ఓ బ్రహ్మపదార్ధం. అది అర్ధం చేసుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ పుట్టిన నాటి నుంచీ మేధావులంతా తలమునకలై తపస్సు చేస్తూనే వున్నారు. అయినా ఫలితం అంతంతమాత్రం. బృందావనం సినిమా హిట్టయి, జనం చూస్తున్నారంటే, ఇలా అనుకోకతప్పదు. ఎందుకలా అనుకోవాలి... అని ఆలోచించే ముందు సినిమా కథ(లు) ఒకసారి తెలుసుకోవాలి.
ఆడుతూ పాడుతూ తిరిగే క్రిష్ (ఎన్టీఆర్) తండ్రి ఓ కోటీశ్వరుడు (ముఖేష్‌రుషి). కథానాయకుడు చాలా సినిమాల్లో లాగే ఫ్రెండ్ ప్రేమ పెళ్లి చేయడానికి హోరాహోరీ యుద్ధాలు సాగిస్తాడు. అదీ ఇంట్రడక్షన్. అతనికో ప్రియురాలు ఇందు (సమంత). కష్టాలు లేకుండా జీవితం సాగిపోతోందనుకుంటే, ప్రియురాలి, ప్రాణస్నేహితురాలు భూమి(కాజల్)ని, ఇబ్బందుల్లోంచి తప్పించడానికి ఓ ప్రేమనాటకం ఆడాల్సి వస్తుంది. భూమి తండ్రి రామ్‌ప్రసాద్(ప్రకాష్‌రాజ్)కు, అతని సవతి తమ్ముడు (శ్రీహరి)కి మధ్య వున్న తగవులు, ఊర్ల మధ్య గొడవలు.. ఉమ్మడి కుటుంబం.. వగైరా వ్యవహారాలెన్నో వుంటాయి. ఈ సమస్యలన్నీ చక్కదిద్ది రెండు కుటుంబాలు ఒకదగ్గరికి చేరడంతో కథ విశ్రాంతికి చేరుతుంది. అంటే ప్రేక్షకులు కలిసుందాం రా.. సినిమా దాదాపు చాలా వరకు చూసేసినట్లే.
ఇక రెండవ సినిమా, బావగారూ బాగున్నారా విశ్రాంతి తరువాత ప్రారంభమవుతుంది. ఇందు, భూమి వరసకు అక్కచెల్లెళ్లన్న సంగతి అప్పుడే బయటపడుతుంది కాబట్టి. ఒక పక్క భూమితో క్రిష్ పెళ్లి ఏర్పాట్లు జరిగిపోతుంటాయి.. మరోపక్క ఏమి చేయాలో తెలియక నైన్టీన్ సెవెంటీస్‌లోలా హీరో.. ‘హీరోయిన్లు’ విరహగీతాలాలపిస్తుంటారు.. ఇలాంటి కథ ఎలా ముగించాలి..ఇద్దరు హీరోయిన్లలో ఒకరు చావనన్నా చావా లి..త్యాగమన్నా చేయాలి..లేదా..ఆ మూ డో ఆప్షనేమిటో..శోభన్‌బాబు, జగపతిబాబు సినిమాలు చూసి తరించిన వారందరికీ తెలుసు. అదే జరిగింది.
ఇక మరి ఇలా రెండు కథలు మిక్సీలోవేసి రుబ్బితే, సినిమా జనానికి ఎందుకు నచ్చుతోంది..అన్నది పెద్ద ప్రశ్న. దీనికి కారణం ఒక్కటే. దర్శకుడు వంశీపైడిపల్లి స్క్రిప్ట్ వర్క్. పెద్దగా గజిబిజి లేకుండా, స్ట్రయిట్‌గా నెరేట్ చేసిన తీరు. రెండవది దర్శకుడు సినిమాకు కావాల్సిన మసాలాలన్నీ కచ్చితంగా సమపాళ్లలో రంగరించాడు కనుక. ఇక దానికి సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు, యాక్షన్ సన్నివేశాలకు రూపకల్పన చేసిన రామ్‌లక్ష్మణ్ అద్భుతంగా తమ వంతు సహకారం అందించారు. కథలో ఎంత పాత వాసనలున్నా, కొత్తగా, వీలయినంత అందంగా చూపించడానికి ఛోటా, యాక్షన్ సన్నివేశాలను మరింత విభిన్నంగా రూపొందించడానికి రామ్‌లక్ష్మణ్ తమ సృజనకు మరింత పదునుపెట్టారు. ఆనంద్‌సాయి ఆర్ట్ డైరక్షన్ సినిమాకు నిండుతనాన్నిచ్చింది. మొత్తం మీద ఇలా అన్నీ కలిసొచ్చి, సినిమా మాస్ జనాలకు పట్టేలా తయారైకూర్చుంది. దీనికితోడు ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు, కళ్ల నీళ్ల తడి కనిపించే సీన్లు మహిళాప్రేక్షకుల కోసం వుండనే వున్నాయి. సినిమాలో సాంకేతికంగా వెనకబడినదేదైనా వుందంటే అది థమన్ సంగీతం ఒకటే. నేపథ్య సంగీతం, అన్ని సన్నివేశాల్లోనూ భారీగా వినిపించింది. పాటలు సినిమాలో చిత్రీకరణ హడావుడికే తప్ప బయట వినేందుకు వీలుగా లేవు.
ఇక నటీనటులందరికీ (ప్రకాష్‌రాజ్, శ్రీహరి, కోటా, తనికెళ్ల, ఆహుతిప్రసాద్, రఘుబాబు, బ్రహ్మానందం, వేణుమాధవ్, ముఖేష్‌రుషి, అజయ్‌వగైరా) ఇటువంటి పాత్రలు పాతవే. ఒక్క ఎన్టీఆర్‌కు తప్ప. సగం సన్నివేశాల్లో ఇంతవరకు చేయని పాత్రను చేయాల్సి వచ్చింది. సినిమాలో ఓ డైలాగ్ వుంది..‘కొత్తగా వుందని ట్రయ్ చేసా..అసలు స్వరూపం లోపల వుండనే వుంది’ అని. కొత్త తరహా పాత్రను ఎన్టీఆర్ బాగానే చేసాడు. ఇక కాజల్, సమంతా కూడా పాత్రలకు బాగానే సరిపోయారు. అవసరమైన సన్నివేశాల్లో వారి ముఖాల్లో ఫీలింగ్స్‌ను గమనించే అవకాశాన్ని దర్శకుడు, ఫొటోగ్రాఫర్, ప్రేక్షకులకిచ్చారు. చాలా సినిమాల్లో హీరోయిన్లకు ఈ అవకాశం దక్కడం లేదు. పైగా ఓ మాస్ పాటలో ఇద్దరు హీరోయిన్లు, ఇద్ధరు వ్యాంప్‌లకు తీసిపోని చందంగా యథాశక్తి గెంతి, సినిమా విజయానికి తమ వంతు సాయం అందించారు. పైగా ఆ పాటలో పదాలు కూడా అలాగే వున్నా యి.. ‘రా..రా..కుమ్మెయ్‌రా..ఏదో చేసేయ్‌రా’ అంటూ.. ఇవన్నీ చాలవా.. నిర్మాత దిల్‌రాజు గట్టెక్కడానికి.

No comments:
Post a Comment